ప్రకాష్ రాజ్ పోస్ట్ ప్రొడక్షన్స్ మన ఊరి రామాయణం ఫస్ట్ కాపీ

మనఊరి రామాయణం,
ప్రకాష్ రాజ్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నటువంటి bilingual film మన ఊరి రామాయణం (తెలుగు)and ఇదొల్లె రామాయణ (కన్నడ ) నిర్మాణతర కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెలలో సెన్సార్ పూర్తి చేసుకుని సెప్టెంబర్ మాసంలో రిలీజ్ కి రెడీ అవుతుంది, ఈ సినిమాని హైదరాబాదు షాద్ నగర్, రామోజీ ఫిల్మ్ సిటీ మరియు కర్ణాటక కూర్గ్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించారు. జాతీయ అవార్డు గ్రహితులైనటువంటి ఇళయరాజా, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్, కళా దర్శకుడు శశిధర్ ఆడప, వంటి కళా నిపుణులు ఈ చిత్రానికి వర్క్ చేసారు. ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ ట్రైలర్ ఈ రోజు రిలీజ్ అవుతుంది.

ఈ చిత్రం గురించి చెప్పాలంటే దుబాయ్ రిటర్న్ ఐనటువంటి ఒక వ్యక్తి ,సమాజంలో ఎంతో గౌరవించబడే ఆ వ్యక్తి జీవితంలో శ్రీరామనవమి టైం లో జరిగినటువంటి ఒక సంఘటన తన జీవితాన్ని ఏ విధంగా మలుపు తిప్పింది అనేది ప్రధానంశంగా తెరకెక్కింది, ప్రతి మనషి లో ఒక రాముడు ఒక రావణుడు వుంటాడు,, ఈ సినిమాలో రాముడు, రావణుడిగామారి ఏం చేసాడుఅనేది కధాంశం, ఒక్క ముక్కలో ఇది మనందరి రామాయణం, మన ఊరి రామాయణం 
ఆర్టిస్ట్స్ : ప్రకాష్‌ రాజ్, ప్రియమణి, సత్యదేవ్‌ (జ్యోతిలక్ష్మి ఫేమ్), పృథ్వీ,
టెక్నిషియన్స్ :
కథ : జాయ్మాథ్యూ
మాటలు : రమణ గోపిశెట్టి, ప్రకాష్ రాజ్
సాహిత్యం : భాస్కరభట్ల రవికుమార్
ఆర్ట్ : శశిధర్ అడప
ఎడిటర్ : శ్రీకర్ ప్రసాద్
సినిమాటోగ్రఫీ : ముకేశ్
సంగీతం : ఇళయరాజా
నిర్మాతలు : ప్రకాష్ రాజ్, రామ్ జీ
స్క్రీన్ ప్లే- దర్శకత్వం : ప్రకాష్ రాజ్

No comments

Powered by Blogger.